లుంగీ కడతారా? | Shah Rukh Khan's next to be Land Of Lungi | Sakshi
Sakshi News home page

లుంగీ కడతారా?

Jul 26 2019 12:24 AM | Updated on Jul 26 2019 12:24 AM

Shah Rukh Khan's next to be Land Of Lungi - Sakshi

షారుక్‌ ఖాన్‌

రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ కోసం లుంగీ కట్టి లుంగీ డ్యాన్స్‌ చేశారు షారుక్‌ ఖాన్‌. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఇలా చేశారాయన. ఇప్పుడు మరోసారి లుంగీ కట్టనున్నారని బాలీవుడ్‌ గాసిప్‌. 2014లో వచ్చిన అజిత్‌ ‘వీరమ్‌ చిత్రాన్ని సాజిద్‌ నడియాడ్‌వాలా బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఫర్హాద్‌ సంజీ దర్శకుడు. దీనికి ‘లాల్‌’ (ల్యాండ్‌ ఆఫ్‌ లుంగీ) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.  ఈ సినిమా తొలుత అక్షయ్‌ కుమార్‌ దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత విక్కీ కౌశాల్‌ దగ్గరకు వెళ్లింది. డేట్స్‌ లేని కారణంగానే ఈ హీరోలు లుంగీ కట్టే చాన్స్‌ మిస్‌ అయ్యారు. ఇప్పుడు షారుక్‌ ఖాన్‌ ఈ రీమేక్‌లో హీరోగా కనిపిస్తారని తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement