జీరోగా మారిపోయిన షారూఖ్‌ | Shah Rukh Khan Zero Title Announcement Teaser Out | Sakshi
Sakshi News home page

Jan 1 2018 6:31 PM | Updated on Jan 1 2018 6:48 PM

Shah Rukh Khan Zero Title Announcement Teaser Out - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ బాద్‌ షా సినిమాలు వరుసగా బోల్తా పడుతున్నా ప్రయోగాలకు మాత్రం అస్సలు వెనకాడటం లేదు. తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం టైటిల్‌ను కొత్త సంత్సరం కానుకంగా అందించారు.

తన టైటిళ్లతోనే ఆకర్షించే దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీరో అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇందులో షారూఖ్‌ మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక టీజర్‌లో ఓ పార్టీలోకి వచ్చిన షారూఖ్‌ స్టెప్పులేయటం ఫన్నీగా ఉంది. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్‌ 21, 2018న చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించేశారు కూడా. 

గతేడాది షారూఖ్‌ నటించిన రయిస్‌, జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రాలు, చివరకు గెస్ట్‌ రోల్‌ చేసిన సల్మాన్‌ ట్యూబ్‌లైట్‌ కూడా బోల్తా పడ్డాయి. దీంతో కింగ్‌ ఖాన్‌కు ఇప్పుడు ఓ భారీ బ్లాక్‌ బస్టర్‌ తప్పనిసరి. అయితే టైటిల్‌తోపాటు, క్యారెక్టర్‌ పరంగా షారూఖ్‌ చేస్తున్న ఈ సాహసం అభినందనీయమైనప్పటికీ.. ఎంత మేర సక్సెస్‌ అవుతుందన్నది మాత్రం ప్రేక్షకులే నిర్ణయించనున్నారు.

మరుగుజ్జు పాత్రలో షారూఖ్‌ ’జీరో’ 

Advertisement
 
Advertisement
Advertisement