ప్రతిరోజు స్పెషల్ చాపర్‌లో షూటింగ్‌కు..! | Shah Rukh Khan Takes A Chopper To Shoot Daily | Sakshi
Sakshi News home page

Apr 6 2018 1:28 PM | Updated on Apr 6 2018 7:08 PM

Shah Rukh Khan Takes A Chopper To Shoot Daily - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్ ప్రస్తుతం జీరో పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షారూఖ్‌ మరగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు వెళ్లేందుకు రోజూ షారూఖ్‌ స్పెషల్ చాపర్‌ ను వినియోగిస్తున్నారట. రోజు ముంబై ట్రాఫిక్ కారణంగా షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

రిలీజ్‌ డేట్‌విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు చిత్రయూనిట్‌. దీంతో ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవటం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ భారీగా ఉండటంతో యూనిట్‌ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. రోజూ ట్రాఫిక్‌ కారణంగా షారూఖ్ షూటింగ్ కు ఆలస్యంగా వస్తుండటం వల్ల కూడా అనుకున్న సమయానికి షెడ్యూల్‌ను పూర్తి చేయలేకపోతున్నారట. అందుకే స్పెషల్‌ చాపర్‌ వినియోగించాలని నిర్ణయించారు.

షారూఖ్‌ సరసన కత్రినా కైఫ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క శర్మ, అభయ్ డియోల్‌ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్, దీపికా పదుకొణే, రాణీ ముఖర్జీ, కాజోల్‌ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement