అందుకే ఆ సినిమా వదులుకున్న : షారుక్‌ | Shah Rukh Khan Reveals He Rejected Raavan | Sakshi
Sakshi News home page

అందుకే ఆ సినిమా వదులుకున్న : షారుక్‌

Feb 2 2019 10:48 AM | Updated on Feb 2 2019 10:55 AM

Shah Rukh Khan Reveals He Rejected Raavan - Sakshi

దర్శకుడు మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటుడు కోరుకుంటాడు. అలాంటి తనకు మరోసారి అవకాశం వచ్చినప్పటికి వదులుకున్నాను అంటున్నారు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌. మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో 2010లో ‘రావణ్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత అభిషేక్‌ పాత్రకు షారుఖ్‌ ఖాన్‌ను తీసుకోవాలనుకున్నారట దర్శకుడు మణిరత్నం.

ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్‌ ఖాన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మణిరత్నంతో పని చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేస్తాను. తనతో సినిమా చేయడం చాలా సరదాగా ఉంటుంది. రావణ్‌ సినిమాలో నన్ను తీసుకోవాలని మణిరత్నం భావించారు. కానీ అప్పుడు నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. అదికాక ‘రావణ్‌’ రెండు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పారు. దాంతో ఈ సినిమా చేయడం కష్టమని భావించాను. అందుకే వదులుకున్నాన’ని తెలిపారు షారుక్‌ ఖాన్‌. అయితే షారుక్‌ ఖాన్‌, మణిరత్నం, మనిషా కోయిరాల కాంబినేషన్‌లో 1998లో ‘దిల్‌సే’ చిత్రం వచ్చింన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement