సార్.. మీ నుంచే నేర్చుకున్నాను: షారుఖ్‌ | Shah Rukh Khan retweets for Amitabh Bachchan tweet | Sakshi
Sakshi News home page

సార్.. మీ నుంచే నేర్చుకున్నాను: షారుఖ్‌

Jan 27 2017 5:13 PM | Updated on Sep 5 2017 2:16 AM

సార్.. మీ నుంచే నేర్చుకున్నాను: షారుఖ్‌

సార్.. మీ నుంచే నేర్చుకున్నాను: షారుఖ్‌

రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించి నిర్మించిన చిత్రం ‘రాయిస్’.

ముంబై: రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించి నిర్మించిన చిత్రం ‘రాయిస్’. షారుఖ్ మూవీతో పాటు హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'కాబిల్' ఈ బుధవారం విడుదలైనా.. రాయిస్ మాత్రం కలెక్షన్లతో దూసుకుపోతోంది. షారుఖ్ లేటెస్ట్ మూవీపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రాయిస్‌ మూవీలో షారుఖ్ నటనపై ట్వీట్ చేశాడు. ముందుగా షారుఖ్‌ను అభినందించిన బిగ్ బి అమితాబ్.. రాయిస్‌లో నీ ఆవేశం నచ్చిందంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

అమితాబ్ లాంటి గొప్పనటుడు తనను కంగ్రాట్స్ చెప్పడంతో పాటు ప్రశంసించడాన్ని షారుఖ్‌ చాలా వినమ్రంగా రిసీవ్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న అమితాబ్‌ ట్వీట్‌కు షారుక్‌ రీట్వీట్ చేస్తూ.. సార్ మీనుంచి ఈ ఆవేశాన్ని, నటన నేర్చుకున్నానని తన హోదాను మరింత పెంచుకున్నాడు షారుఖ్. దీంతో అమితాబ్ వారసుడిగా బాలీవుడ్‌ న్యూ యాంగ్రీ మ్యాన్ షారుఖ్ అంటూ ఇండస్ట్రీ వర్గాలు స్పందిస్తున్నాయి. మరోవైపు రాయిస్ విడుదలను కొన్ని నెలలుగా నిలుపుదలచేస్తూ ఇప్పుడు విడుదల చేయడం తమ సినిమాకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement