అభిమాని ట్వీట్‌పై స్పందించిన షారూఖ్‌ | Shah Rukh Khan Promises to Meet Specially Abled Fan | Sakshi
Sakshi News home page

అభిమాని ట్వీట్‌పై స్పందించిన షారూఖ్‌

Feb 27 2019 10:18 AM | Updated on Feb 27 2019 1:06 PM

Shah Rukh Khan Promises to Meet Specially Abled Fan - Sakshi

సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ముఖ్యంగా భారత్‌లో షారూఖ్‌ అంటే ప్రాణమిచ్చే అభిమానులకు లెక్కే లేదు. ఇటీవల షారూఖ్‌ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోయినా క్రేజ్‌ విషయంలో మాత్రం షారూఖ్ ఇప్పటికే టాప్‌లో ఉన్నాడు. తాజాగా ఓ అభిమాని చేసిన ట్వీట్ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

అమృత్‌ అనే వ్యక్తి దివ్యాంగుడైన తన సోదరుడికి షారూఖ్‌ని కలవాలనుందని రెండు రోజుల క్రితం ఓ వీడియోనూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. రాజు మీట్స్‌ షారూఖ్‌ (#RajuMeetsShahrukh) హ్యాష్‌ ట్యాగ్‌తో  ట్రెండ్‌ అయిన ఈ వీడియో ఫైనల్‌గా షారూఖ్‌ను చేరింది. వెంటనే స్పందించిన షారూఖ్‌ ‘అమృత్‌ క్షమించాలి. మీ వీడియోను ఆలస్యంగా చూశాను. అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయండి. త్వరలోనే నేను రాజును కలిసి మాట్లాడేందుకు వస్తాను’అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో షారూఖ్‌ స్పందించిన తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement
 
Advertisement
Advertisement