ఆమిర్‌ స్థానంలో షారూఖ్‌..?

Shah Rukh Khan is likely to replace Aamir Khan in the biopic - Sakshi

చంద్రుడిపై అడుగుపెట్టిన భారత వ్యోమగామి రాకేశ్‌‌ శర్మ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్నట్టు ఆ మధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా కబురు ఏమిటంటే.. ఈ సినిమా నుంచి ఆమిర్‌ తప్పుకొని తెరపైకి కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ వచ్చాడట.

ఈమేరకు చక్కర్లు కొడుతున్న రూమర్లపై తాజాగా షారూఖ్‌ స్పందించాడు. 63వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వేడుకల్లో పాల్గొన్న షారూఖ్‌ను ఈ విషయమై అడగగా.. ఇప్పటివరకు కొత్త సినిమాకు సైన్‌ చేయలేదని స్పష్టం చేశాడు. తాను ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ సినిమాలో నటిస్తున్నానన్నాడు. ఆ సినిమాలో ఛాలెంజింగ్‌ పాత్ర చేస్తున్నానని, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆ సినిమా కోసమే సమయం కేటాయించానన్నాడు. సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌తో పాటు, మరికొందరు నిర్మాతల్ని కలిసినప్పటికీ, మరో రెండు నెలల తర్వాతే తన తదుపరి సినిమాపై స్పష్టతనిస్తానని తెలిపాడు. దీంతో రూమర్లకు తెర పడినట్లయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top