నా వల్లే మా అమ్మాయికి ఇబ్బంది! | Shah Rukh Khan finally breaks his silence on Suhana's viral bikini picture | Sakshi
Sakshi News home page

నా వల్లే మా అమ్మాయికి ఇబ్బంది!

Jul 5 2016 12:02 AM | Updated on Oct 22 2018 6:02 PM

నా వల్లే మా అమ్మాయికి ఇబ్బంది! - Sakshi

నా వల్లే మా అమ్మాయికి ఇబ్బంది!

సెలబ్రిటీలే కాదు.. వారి పిల్లలు కూడా ఏం చేసినా అది హాట్ టాపిక్ అవుతుంది. వారిని అటు అభిమానులతో పాటు ఇటు మీడియా సైతం...

సెలబ్రిటీలే కాదు.. వారి పిల్లలు కూడా ఏం చేసినా అది హాట్ టాపిక్ అవుతుంది. వారిని అటు అభిమానులతో పాటు ఇటు మీడియా సైతం ఫాలో అవుతూ ఉంటుంది. ఇతర రంగాల సెలబ్రిటీల ఫాలోయింగ్ ఒక ఎత్తయితే.. సినిమా రంగంలోని వారికి ఉండే ఫాలోయింగ్ మరో ఎత్తు అవుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ముద్దుల కుమార్తె సుహాన. ఈ టీనేజ్ బ్యూటీ బికినీలో ఉన్న ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షారుక్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘సుహాన వయస్సు ఇప్పుడు పదహారేళ్లు. బీచ్‌లో తన తమ్ముడు అభిరామ్‌తో కలసి ఆడుకుంటున్నప్పటి ఫొటోలు తీసి పబ్లిసిటీ చేయడం తగదు. పైగా షారుక్ కూతురు బీచ్‌లో బికినీతో బాడీ ప్రదర్శన ఇస్తోందని రాయడం సభ్యత కాదు. ఇటువంటి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి ఎందుకంత వివాదం చేస్తున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. సుహాన ఫొటో ఇలా వైరల్ కావడానికి కారణం నా స్టార్‌డమ్.

అదే తన పాలిట శత్రువైందేమో అనిపిస్తోంది. తను నా కుమార్తె కాకుండా ఉంటే అసలు అది వార్త అయ్యుండేది కాదు. ఎవరూ చాటుమాటుగా ఫొటోలు తీసి, పరువు బజారుకీడ్చేవాళ్లు కాదు. సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన వారికి పర్సనల్ లైఫ్ ఉండదా? వయసుతో సంబంధం లేకుండా ఇటువంటి ఫొటోలు పెట్టి వివాదం చేయడం తగదు’’ అని ఆగ్రహావేదనలతో షారుక్ అన్నారు. ఓ తండ్రిగా ఆయన పడుతున్న బాధలో న్యాయం ఉంది కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement