సల్మాన్ సినిమాలో షారూఖ్ | Sakshi
Sakshi News home page

సల్మాన్ సినిమాలో షారూఖ్

Published Sat, Jun 17 2017 3:26 PM

సల్మాన్ సినిమాలో షారూఖ్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ట్యూబ్ లైట్. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాత, నటుడు సోహైల్ ఖాన్, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. తన అభిమాన దర్శకుడైన కబీర్ ఖాన్తో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నాడు. అదే సమయంలో ఆసక్తికరమైన విషయమొకటి వెల్లడించాడు.

సల్మాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నాడట. కథను మలుపు తిప్పే ఇంపార్టెంట్ క్యారెక్టర్లో షారూఖ్ కనిపించబోతున్నట్టుగా వెల్లడించాడు సోహైల్. అంతేకాదు ఆ పాత్రకు షారూఖ్ ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుందని అందుకే షారూఖ్ను ఆ పాత్రకు ఒప్పించినట్టుగా తెలిపాడు. ఈద్ సీజన్లో సూపర్ హిట్ రికార్డ్ ఉన్న సల్మాన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు.

Advertisement
Advertisement