'గూడచారి' హీరోయిన్ రీతూ వర్మ | Sesh, Ritu Varma Team Up For Spy Thriller | Sakshi
Sakshi News home page

'గూడచారి' హీరోయిన్ రీతూ వర్మ

Aug 8 2016 4:02 PM | Updated on Sep 4 2017 8:25 AM

'గూడచారి' హీరోయిన్ రీతూ వర్మ

'గూడచారి' హీరోయిన్ రీతూ వర్మ

'పెళ్లిచూపులు' సినిమాలో స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా ప్రేక్షకులను మెప్పించిన రీతూ వర్మ తన తదుపరి చిత్రానికి సైన్ చేసింది.

'పెళ్లిచూపులు' సినిమాలో స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా ప్రేక్షకులను మెప్పించిన రీతూ వర్మ తన తదుపరి చిత్రానికి సైన్ చేసింది. పెళ్లిచూపుల్లో చిత్రగా చక్కటి అభినయాన్ని కనబరిచిన ఈ అమ్మాయి అందరి ప్రశంసలు అందుకుంటుంది. 'క్షణం' సినిమాతో టాలీవుడ్కి తన టాలెంట్ను చూపించిన అడవి శేష్ తదుపరి చిత్రం 'గూడచారి'లో రీతూ హీరోయిన్గా ఎంపికైంది.

అక్టోబర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. పెళ్లిచూపులు సినిమాలో రీతూ నటనను చూసి ఇంప్రెస్ అయిన చిత్ర యూనిట్.. వెంటనే ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది. రాహుల్ పాకాల,శశికిరణ్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పేరుకి తగ్గట్టుగా సస్పెన్స్ థ్రిల్లర్గా అలరించనుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ ఇతర నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement