
గ్రాండ్‌గా ప్రారంభించిన బిగ్‌బాస్ షోలో రెండో పార్టిసిపెంట్‌గా సీరియల్ నటుడు రవికృష్ణ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో క్యాటగిరీ నుంచి ఒక్కో సెలబ్రెటీని ఎంచుకునే బిగ్‌బాస్ టీమ్ ఈసారి సీరియల్‌లో నటించే వారికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనబడుతోంది. సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా రవికృష్ణ మారాడు.
మొగలిరేకులు సీరియల్‌లో ఓ చిన్న పాత్రను చేసిన రవికృష్ణ.. ప్రస్తుతం పలు సీరియల్స్‌లో హీరో పాత్రలను పోషిస్తూ బిజీగా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణం, వరూధిని పరిణయం లాంటి సీరియల్స్‌తో మహిళాలోకానికి సుపరిచితుడు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా హీరోగా మారి చివరి వరకు నిలబడి టైటిల్ గెలుచుకుంటాడా? అన్నది చూడాలి.