సెంథిల్కు షారూఖ్ పిలుపు | Senthil cinematography for sharukh dilwale song | Sakshi
Sakshi News home page

సెంథిల్కు షారూఖ్ పిలుపు

Sep 25 2015 8:25 AM | Updated on Aug 11 2018 8:30 PM

సెంథిల్కు షారూఖ్ పిలుపు - Sakshi

సెంథిల్కు షారూఖ్ పిలుపు

రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల విజయంలో సెంథిల్ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఈగ సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్, బాహుబలి...

రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల విజయంలో సెంథిల్ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఈగ సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్, బాహుబలి సినిమాతో స్టార్ సినిమాటోగ్రాఫర్గా మారిపోయాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సెంథిల్ కెమరా పనితనానికి ఫిదా అయిపోతున్నారు.

మామూలు స్టార్లే కాదు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా సెంథిల్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట. అందుకే ప్రస్తుతం షారూఖ్ చేస్తున్న 'దిల్వాలే' సినిమా కోసం షూట్ చేయాల్సి ఉన్న ఒక్క పాటకు సెంథిల్ను సినిమాటోగ్రఫీ అందించాలంటూ ఆహ్వానించాడు. ఇందుకు అంగీకరించిన సెంథిల్ త్వరలోనే దిల్వాలే టీంతో జాయిన్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఒక్క పాటకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన షారూఖ్, తన వర్క్ నచ్చితే తదుపరి సినిమాకు పూర్తి స్థాయి కెమెరామన్గా తీసుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement