‘పెళ్లి చూపులు’ రోజులు గుర్తుకొస్తున్నాయి | Sensation Hero Vijay Devarakonda Releasing Husharu Movie Song | Sakshi
Sakshi News home page

Nov 19 2018 7:37 PM | Updated on Nov 19 2018 7:41 PM

Sensation Hero Vijay Devarakonda Releasing Husharu Movie Song - Sakshi

‘హుషారు’ చిత్ర పోస్టర్, ట్రైలర్‌ను చూస్తుంటే తనకు ‘పెళ్లి చూపులు’ రోజులు గుర్తుకొస్తున్నాయంటూ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు.  లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించిన చిత్రం హుషారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్‌ కానుంది . యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన హుషారు సినిమా పాటలు, ట్రైలర్లకు మంచి క్రేజ్ వచ్చింది . ఈ సినిమాలో మూడో   పాటను '' డియర్ కామ్రేడ్'' షూటింగ్‌‌లో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఇటీవల రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు హర్ష నా సెట్‌కు వచ్చి హుషారు సినిమా పాటను రిలీజ్ చేయమని అడిగారు. ఇప్పటికే సిద్ శ్రీరాం పాడిన పాటను విన్నాను. ఫ్రెండ్ షిప్ ఆధారంగా రూపొందించిన మూడో పాటను రిలీజ్ చేయమన్నారు. వాస్తవానికి పెళ్లిచూపులకు ముందే హర్ష నాకు ఈ సినిమా స్క్రిప్టు పంపించారు. స్క్రిప్టు చదువుతున్నప్పుడే నాకు విపరీతంగా నవ్వు వచ్చింది. నాకు  నచ్చే అర్బన్ టైప్ కామెడీ ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. మొదటి సినిమా అప్పుడు ఉండే ఉత్సాహం హర్షలో కనిపిస్తుంది’అని అన్నారు. 

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''విజయ్ దేవరకొండతో మంచి రిలేషన్ ఉంది. అందుకే కాకినాడలో జరిగే షూటింగ్‌కు వచ్చి విజయ్ దేవరకొండను కలిశాం. మా హుషారు చిత్రంలోని ఫ్రెండిషిప్ పాటను రిలీజ్ చేయమని అడగ్గానే సంతోషంగా ఒప్పుకొన్నారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. దర్శకుడు హర్ష మాట్లాడుతూ..'' పెళ్లిచూపులకు ముందు నుంచి నాకు విజయ్ దేవరకొండతో పరిచయం ఉంది. అప్పట్లో ఈ స్క్రిప్టును ఆయనకు పంపాను. చాలా బాగుందని అప్పట్లో రెస్పాన్ష్ ఇచ్చారు. ప్రస్తుతం అదే సినిమాకు సంబంధించిన పాటను విజయ్ దేవరకొండతో రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement