సీనియర్‌ హీరోయిన్‌కు డాక్టరేట్‌

Senior Actress Shobana To Receive Doctorate - Sakshi

సీనియర్‌ నటి, నాట్యకళాకారిణి శోభన, సంగీతదర్శకుడు హరీశ్‌జయరాజ్‌లకు ఎంజీఆర్‌ విద్యా పరిశోధన సంస్థ గౌరవ డాక్టరేట్‌లను ప్రకటించింది. ఈ విద్యాసంస్థ  విద్యార్థులకు పట్టాలను అందించే కార్యక్రమం ఈ నెల 10వ తేదీన వేలప్పన్‌ చావడిలోని ఏసీఎస్‌ కన్వెన్సన్‌ సెంటర్‌లో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది.

ఎంజీఆర్‌ విద్య, పరిశోధన సంస్థ అధినేత ఏసీ.షణ్ముగం నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో విక్రం సారాబాయ్, స్పేస్‌ డైరెక్టర్‌ సోమనాథ్, నటి, భరతనాట్యకళాకారిణి శోభన, సంగీత దర్శకుడు హరీశ్‌జయరాజ్‌లను గౌరవ డాక్టరేట్‌లతో ఘనంగా సత్కరించనున్నారు. కార్యకమంలో రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ వేదికపై 3,300 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ అందించనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top