అలెగ్జాండర్‌ ఒక్కడే | senior actor jayaprakash reddy as hero in alexander | Sakshi
Sakshi News home page

అలెగ్జాండర్‌ ఒక్కడే

Oct 22 2019 2:22 AM | Updated on Oct 22 2019 2:22 AM

senior actor jayaprakash reddy as hero in alexander - Sakshi

జయప్రకాశ్‌ రెడ్డి

నాటక రంగం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చి విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎంతో పేరు సంపాదించారు జయప్రకాశ్‌ రెడ్డి. ఆయన ముఖ్య భూమిక పోషించిన చిత్రం ‘అలెగ్జాండర్‌’. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్‌.  ఉద్భవ్‌ నాన్వి క్రియేషన్స్‌ పతాకంపై విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయప్రకాశ్‌ రెడ్డి మాత్రమే నటించటం విశేషం. కొన్ని వందల చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న జయప్రకాశ్‌ రెడ్డి ఒకే పాత్ర ఉన్న చిత్రంలో హీరోగా నటించిన చిత్రం ఇది. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement