మంచు కొండల్లో క్లిక్! | selfie of Sridevi's daughter Jhanvi | Sakshi
Sakshi News home page

మంచు కొండల్లో క్లిక్!

Apr 26 2016 12:39 AM | Updated on Sep 3 2017 10:43 PM

మంచు కొండల్లో క్లిక్!

మంచు కొండల్లో క్లిక్!

వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లా? అక్కాచెల్లెళ్లా? అనే డౌటు శ్రీదేవి, ఆమె పెద్ద కూతురు జాన్వీని చూసినప్పుడు కలగడం సహజం.

వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లా? అక్కాచెల్లెళ్లా? అనే డౌటు శ్రీదేవి, ఆమె పెద్ద కూతురు జాన్వీని చూసినప్పుడు కలగడం సహజం. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న శ్రీదేవి టీనేజ్‌లో ఉన్న తన కూతురికి అక్కలానే కనిపిస్తారు. ఆ రేంజ్‌లో ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తున్నారామె. తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీలను దాచి దాచి పెంచలేదు శ్రీదేవి. తల్లితో పాటు ఈ కూతుళ్లిద్దరి దర్శనాలు కూడా బాగానే దొరికాయి. కానీ, దాదాపు ఏడాదిన్నరగా జాన్వీ కెమెరాలకు చిక్కడం లేదు. దానికి కారణం అమెరికాలో చదువుకుంటోంది.

వీలున్నప్పుడల్లా కూతురి దగ్గరికి వెళ్లి వస్తుంటారు శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్. ప్రస్తుతం శ్రీదేవి అక్కడే ఉన్నారు. మరి.. బోనీ కూడా వెళ్లారో లేదో తెలియదు కానీ, శ్రీదేవి మాత్రం కూతురితో కలిసి దిగిన సెల్ఫీలో కనిపించారు. ఈ తల్లీకూతుళ్లిద్దరూ సరదాగా మంచుకొండల్లో విహరించినట్లున్నారు. ఆ సందర్భంగా కూతురితో శ్రీదేవి దిగిన సెల్ఫీ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.

టీనేజ్‌లో శ్రీదేవి ఎంత అందంగా ఉండేవారో ఇప్పుడు జాన్వీ కూడా అంతే అందంగా ఉంది కదూ. చూడబోతుంటే తల్లిలానే జాన్వీలో కూడా మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందనిపిస్తోంది. కూతుళ్లు సినిమాల్లోకి వస్తానంటే బోనీ, శ్రీదేవి కాదనరు. ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారీ దంపతులు. సో.. చదువు ముగిశాక జాన్వీ అరంగేట్రం కావడం ఖాయమే అని కొందరి ఊహ.

Advertisement
 
Advertisement
Advertisement