శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారు కానీ.., : రాజశేఖర్‌ | Rajasekhar Opens Up on Sridevi Marriage Proposal | Sakshi
Sakshi News home page

శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారు : రాజశేఖర్‌

May 5 2026 10:01 AM | Updated on May 5 2026 10:17 AM

Rajasekhar Opens Up on Sridevi Marriage Proposal

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ఇప్పుడు సెకండ్‌ ఇన్సింగ్స్‌  ప్రారంభించారు. మొన్నటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు తీసిన ఆయన..ఇప్పుడు యంగ్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘బైకర్‌’ మూవీలో శర్వానంద్‌ తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్‌ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌..
రాజశేఖర్‌, జీవితలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. `తలంబ్రాలు`(1986) సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే జీవిత కంటే ముందు శ్రీదేవితో తనకు పెళ్లి ప్రపోజల్‌ వచ్చిందని గతంలో ఓ న్యూస్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్‌ చెప్పాడు. ఇదే విషయాన్ని తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్‌ గుర్తు చేసింది. ‘జీవిత కంటే ముందు శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌ వచ్చిందట కదా.. నిజమేనా?’ అని యాంకర్‌ ప్రశ్నించగా.. ‘నిజమే. శ్రీదేవి తండ్రికి, మా నాన్నగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ చొరవతో ఇరువైపులా స్నేహితుల మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆమె మన మధ్య లేరు. అందుకే ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదు. వదిలేద్దాం’ అని రాజశేఖర్‌ చెప్పాడు.

ఆర్టిస్ట్‌ అని శ్రీదేవిని రిజెక్ట్‌ చేశారు
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో​ శ్రీదేవిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో రాజశేఖర్‌ వివరించాడు. ‘శ్రీదేవి నాన్నతో మా నాన్నకు మంచి స్నేహబంధం ఉండేది. కులం కూడా ఒకటే. దూరపు బంధువులు అవుతారు. అందుకే శ్రీదేవి ఫ్యామిలీ నుంచి నాకు పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది. అప్పటికీ నేను సినిమాల్లోకి రాలేదు. ఎంఎస్‌ చదవాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని మా నాన్న వాళ్లకు పెళ్లి.. వారి ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేశారు. సినిమాల్లో నటించేవాళ్లను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. అందుకే శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌ని పక్కన పెట్టారు’ అని రాజశేఖర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement