'బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ నా వీక్ నెస్' | Selena Gomez likes to date with bad boys | Sakshi
Sakshi News home page

'బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ నా వీక్ నెస్'

May 12 2016 8:19 AM | Updated on Sep 3 2017 11:57 PM

'బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ నా వీక్ నెస్'

'బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ నా వీక్ నెస్'

ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన బలహీనతలను బయటపెట్టింది.

లాస్ ఏంజెలిస్: ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన బలహీనతలను బయటపెట్టింది. తాను ఎప్పుడూ బ్యాడ్ బాయ్స్ తోనే డేటింగ్ చేయడానికి ఇష్టపడతానంది. గతంలో కూడా చాలా మంది బ్యాడ్ బాయ్స్ తో డేటింగ్ చేశానని చెప్పింది. మారీ క్లేరీ మేగజైన్ రిపోర్టర్ కు ఈ వివరాలు తెలిపింది. కొద్దికాలం కిందటే ఈ పాప్ అందగత్తె సెలెనా గోమెజ్‌ తన లవర్ జస్టిన్ బీబర్‌కు బ్రేకప్‌ చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే బీబర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిందా? లేక ఆ తర్వాత మరెవరితోనైనా ఆమె డేటింగ్ చేస్తుందా అనే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.

బ్యాడ్ బాయ్స్ తన వీక్ నెస్ అనటంతో అక్కడి యువకులు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. అమీ స్కూమర్, జెన్నిఫర్ లారెన్స్ లను ప్రశంసించింది. వారు అందరు మహిళల మాదిరిగా ఉండరని, అంతకంటే ఎక్కువ అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది. సెలెనా తో బ్రేకప్ అయ్యాక జస్టిన్ బీబర్‌ మాత్రం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేస్తుండగా, ఈ అమ్మడు మాత్రం తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆల్బమ్స్ కోసం ఎంతో శ్రమ పడుతున్న సెలెనా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కునే పనిలో పడిందా.. గతాన్ని మళ్లీ తవ్వుకుంటూ బాధలో ఉందా సన్నిహితులు, అభిమానులు తెలుసుకోలేక పోతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement