వీళ్లు మంచి కిడ్నాపర్లు | Seenu Venu Villumanchi Kidnappers Movie Opening | Sakshi
Sakshi News home page

వీళ్లు మంచి కిడ్నాపర్లు

Jun 16 2018 12:48 AM | Updated on Aug 9 2018 7:30 PM

Seenu Venu Villumanchi Kidnappers Movie Opening - Sakshi

అభిషేక్‌ కన్నెలూరు, మధుప్రియ, ప్రజ్వల్, మమతాశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీను వేణు’. ‘వీళ్లు మంచి కిడ్నాపర్లు’ అన్నది ఉపశీర్షిక. రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుంధర క్రియేషన్స్‌ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

హీరో, హీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత సానా యాదిరెడ్డి క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత ముత్యాల రాందాస్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక–నిర్మాత రవి  మాట్లాడుతూ– ‘‘కిడ్నాప్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇద్దరు పల్లెటూరి అమ్మాయిలను ముంబై గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుం ది. వాళ్లు ఆ గ్యాంగ్‌ నుంచి ఎలా తప్పించుకున్నారన్న కథకు వినోదం జోడించి తీస్తున్నాం’’ అన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: జి. ఆర్యన్‌ (ఏడుకొండలు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement