సవ్యసాచి టీజర్‌.. సూపర్‌ కాన్సెప్ట్‌ | Savyasachi Teaser Released | Sakshi
Sakshi News home page

Oct 1 2018 12:06 PM | Updated on Oct 1 2018 12:14 PM

Savyasachi Teaser Released - Sakshi

మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు..

‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ అంటూ నాగ చైతన్య చెప్పే వాయిస్‌ ఓవర్‌తో రిలీజ్‌ అయిన సవ్యసాచి టీజర్‌ ఆకట్టుకుంటోంది. సోమవారం విడుదలైన ఈ టీజర్‌ను చూస్తే ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని..  ఈ సవ్యసాచిలో సగాన్ని’ అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

టీజర్‌ను డైలాగ్‌ను బట్టి చూస్తే పైకి కనిపించని.. ఒకే శరీరంతో ఉన్న కవలల కథ ఆధారంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్‌ కథానాయిక. భూమిక, మాధవన్‌ కీలక పాత్రలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement