అనాథలు లేని సమాజం కోసం | 'Satya Gang' reaches last leg of shoot | Sakshi
Sakshi News home page

అనాథలు లేని సమాజం కోసం

Feb 6 2018 1:18 AM | Updated on Feb 6 2018 1:18 AM

'Satya Gang' reaches last leg of shoot - Sakshi

అక్షిత, సాత్విక ఈశ్వర్‌

సాత్విక ఈశ్వర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ప్రభాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సత్య గ్యాంగ్‌’. అక్షిత కథానాయిక. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై మహేష్‌ ఖన్నా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ చిత్రం నిర్మించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న మహేష్‌ ఖన్నా మాట్లాడుతూ– ‘‘సమాజంలో అనాథలనేవారు ఉండకూడదనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. సందేశానికి వినోదాన్ని మేళవించి తీస్తున్నాం.

సుమన్, సుహాసినిలపై ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. సాత్విక ఈశ్వర్‌కి చాలా మంచి భవిష్యత్‌ ఉంది. మరో వారం పాటు జరిగే షూటింగ్‌తో పాటలు సహా సినిమా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులూ జరుగుతున్నాయి. త్వరలో పాటలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రత్యూష్, హర్షిత, ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్‌ ఖన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయ్‌ కుమార్, సంగీతం–దర్శకత్వం: ప్రభాస్‌.

Advertisement
 
Advertisement
Advertisement