చేతులు మారిన ఇంట్రస్టింగ్ రీమేక్ | Sathyadev in Sathuranga Vettai remake | Sakshi
Sakshi News home page

Dec 30 2017 12:02 PM | Updated on Dec 30 2017 2:16 PM

Sathyadev in Sathuranga Vettai remake - Sakshi

కోలీవుడ్ ఘనవిజయం సాధించిన శతురంగ వేట్టై సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాను అడివి శేష్ హీరోగా రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే శేష్, గూఢచారి సినిమాతో బిజీగా కావటంతో ఈ రీమేక్ సునీల్ చేతికి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ సినిమా సునీల్ నుంచి మరో నటుడి చేతికి వెళ్లింది.

జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా మారిన యువ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం 47 డేస్, గువ్వా గోరింక సినిమాల్లో నటిస్తున్నాడు. క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సత్యదేవ్ శతురంగ వేట్టై రీమేక్ లో నటించనున్నాడు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై గోపీ గణేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Advertisement
 
Advertisement
Advertisement