అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

Published Sun, Jun 16 2019 12:33 PM

Sarvam Thaala Mayam Selected for Prestigious International Film Festival - Sakshi

షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన సర్వం తాళమయం చిత్రం ప్రదర్శించనున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్, నెడుముడి వేణు, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సర్వం తాళమయం. ప్రముఖ ఛాయాగ్రహకుడు రాజీవ్‌మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 22వ షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు మనోరమ విభాగంలో అధికారికపూర్వకంగా ఎంపికైనట్లు చిత్ర వర్గాలు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement