నంబర్‌ 2 | Sara Ali Khan shines in Kedarnath | Sakshi
Sakshi News home page

నంబర్‌ 2

Dec 16 2018 12:46 AM | Updated on Dec 16 2018 12:46 AM

Sara Ali Khan shines in Kedarnath - Sakshi

సారా అలీఖాన్‌

సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ అనే ట్యాగ్‌ ఇక ఆమెకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె కథానాయికగా నటించిన ‘కేదార్‌నాథ్‌’ చిత్రం విడుదలైంది. సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు సారా నంబర్‌ 2. ఒక్క సినిమా రిలీజైతేనే నంబర్‌ 2 ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఆమె నంబర్‌ 2గా నిలిచింది గూగుల్‌ సెర్చ్‌లో అన్నమాట. ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బాలీవుడ్‌ కథానాయికల్లో సారా నంబర్‌ టూ. ఫస్ట్‌ ప్లేస్‌లో ప్రియాంకా చోప్రా నిలిచారు. ఇక రణ్‌వీర్‌ సింగ్, సారా అలీఖాన్‌ జంటగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సింబా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’కు ఇది హిందీ రీమేక్‌.

Advertisement
 
Advertisement
Advertisement