అపజయం ఓ అనుభవం | Sanju actor Ranbir Kapoor makes Twitter debut on Father's Day | Sakshi
Sakshi News home page

అపజయం ఓ అనుభవం

Jun 19 2018 1:55 AM | Updated on Apr 3 2019 6:23 PM

Sanju actor Ranbir Kapoor makes Twitter debut on Father's Day - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌

ఏ రంగంలో అయినా సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు కామన్‌. కానీ వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్‌ అంటున్నారు బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌.  సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా రూపొందిన ‘సంజు’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు రణ్‌బీర్‌. ఫాదర్స్‌ డే సందర్భంగా ట్వీటర్‌లో అభిమానులతో చాట్‌ చేశారీ హీరో. ఈ సందర్భంగా ఓ అభిమాని సక్సెస్, ఫెయిల్యూర్‌ని ఎలా హ్యాండిల్‌ చేయాలి? అని అడిగితే,  ‘‘సక్సెస్, ఫెయిల్యూర్‌ మనం చేసిన పనికి రిజల్ట్‌ మాత్రమే. రిజల్ట్‌ కంటే ఆ జర్నీని ఎంజాయ్‌ చేయడం నేర్చుకోవాలి. అలాగే సక్సెస్‌ నుంచి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఫెయిల్యూర్‌ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అందులోని పాఠాలే సక్సెస్‌కి ఫార్ములాలు అవుతాయి’’ అని సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement