పేర్లు తారుమారు | Sandeep Aur Pinky Faraar Movie First Look Poster Released | Sakshi
Sakshi News home page

పేర్లు తారుమారు

Mar 4 2020 12:05 AM | Updated on Mar 4 2020 12:05 AM

Sandeep Aur Pinky Faraar Movie First Look Poster Released - Sakshi

‘సందీప్‌ ఔర్‌ పింకీ’ అంటే ఎవరైనా ఏమనుకుంటారు? సందీప్‌ అబ్బాయి పేరు, పింకీ అమ్మాయి పేరు అనే కదా. కానీ ఇక్కడ తారుమారు అయ్యాయి. సందీప్‌ అంటే అమ్మాయి.. పింకీ అంటే అబ్బాయి. అసలు విషయంలోకి వస్తే... అర్జున్‌ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక పేర్లు గురించి చెప్పాలంటే.. అర్జున్‌ కపూర్‌ పాత్ర పేరు ‘పింకీ దహియా’. పరిణీతి పాత్ర పేరు ‘సందీప్‌ కౌర్‌’. దిబాకర్‌ బెనర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement