అది మా ఆయనకు నచ్చదు : సమంత | Samantha Special Interview Super Deluxe Promotion | Sakshi
Sakshi News home page

అది మా ఆయనకు నచ్చదు : సమంత

Mar 22 2019 10:27 AM | Updated on Mar 22 2019 2:59 PM

Samantha Special Interview Super Deluxe Promotion - Sakshi

అది మా ఆయనకు నచ్చదు అని చెప్పింది నటి సమంత. వివాహానంతరం కూడా క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి ఈ బ్యూటీ. తనకు అనిపించింది చేయడానికి వెనకాడని సమంత ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తున్నా, గ్లామరస్‌గా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. కాగా తెలుగులో ఓ బేబీ అంటూ ప్రేక్షకులను పలకరించనున్న ఈ అమ్మడు తమిళంలో విజయ్‌ సేతుపతితో కలిసి సూపర్‌డీలక్స్‌ అంటూ రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల చెన్నైకి వచ్చిన సమంత మీడియాతో కాసేపు ముచ్చటించారు. 

సూపర్‌డీలక్స్‌లో మీ పాత్ర గురించి తెలిసి మీ భర్త నాగచైతన్య షాక్‌ అయ్యారట?
అవును సూపర్‌డీలక్స్‌లో ఇద్దరు నటీమణులు నిరాకరించిన పాత్రను నేను ధైర్యం చేసి నటించాను. ఈ వ్యాంపు పాత్ర గురించి, తొలి సన్నివేశం గురించి నా భర్త నాగచైతన్యకు చెప్పగా ఆయన షాక్‌ అయ్యారు. అయితే ఆ పాత్రలో నేను చాలా సంతృప్తిగా నటించాను. చిత్రంలో పలు ఆశ్యర్యకరమైన విషయాలు ఉంటాయి.

సూపర్‌ ఉమెన్‌ పాత్రలో నటించాలనే ఆసక్తి ఉందా?
ఉంది. ఇటీవల కెప్టెన్‌ మార్వెల్‌ లాంటి సూపర్‌ ఉమెన్‌ కథా చిత్రాలు రావడం మొదలెట్టాయి. ఇండియాలోనూ అలాంటి చిత్రాలు రావాలి. అలాంటి అవకాశం తనకు వస్తే కచ్చితంగా నటిస్తాను.

96 చిత్ర రీమేక్‌ గురించి రకరకాల ప్రచారం జరుగుతుందే?
ఆ చిత్రంలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఇటీవలే ఆ చిత్ర దర్శకుడిని కలిశాను. కాబట్టి నేను కథను మార్చమని చెప్పినట్లు జరుగుతున్న  ప్రచారంలో నిజం లేదు.

నటిగా 10 ఏళ్లలో మీరు నేర్చుకుంది?
ఆరంభంలో నటించడానికి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి అడవిలో వదిలినట్లు అనిపించింది. ఇక్కడ నాకు మార్గదర్శి, చేయి పట్టి తీసుకెళ్లడానికి ఎవరూ లేరు. అందుకేనేమో నాకు ఆత్మవిశ్వాసం, పరిపక్వత అధికంగా వచ్చాయనుకుంటా.

ఓ బేబీ చిత్రం గురించి?
నాకు చాలా కాలంగా పూర్తి వినోదభరిత కథా చిత్రంలో నటించాలన్న ఆశ ఉంది. అది ఓ బేబీతో తీరుతుంది. చిత్రం ఆధ్యంతం నవ్వుకునేలా ఉంటుంది.

తమిళంలో తదుపరి చిత్రం?
ఇంకా ఏ చిత్రం అంగీకరించలేదు. కథలు వింటున్నాను.

ఎలాంటి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు?
క్రీడాకారిణిగా నటించాలని ఆశగా ఉంది. ముఖ్యంగా అథ్లెటిక్‌ క్రీడాకారిణిగా నటించాలని కోరుకుంటున్నాను.

సామాజక మాధ్యమాల్లో ఎప్పుడూ ఫొటోలను పోస్ట్‌ చేస్తుండడం వల్ల మీ భర్త కోపంగా ఉన్నారనే ప్రచారం గురించి?
ఇంటర్నెట్‌లో ఎక్కువగా పోస్ట్‌ చేయడం నాగచైతన్యకు నచ్చదు. అంతే కానీ మీరనుకుంటున్నట్లు ఏమీలేదు.

మీ గ్లామరస్‌ ఫొటోల గురించి వచ్చే విమర్శలపై ఎలా స్పందిస్తారు?
అలాంటి వాటిని నేను చదవడం మానేశా. నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంతే. దాని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారన్నది డోంట్‌కేర్‌. అంతే కాకుండా నేను తమిళంలో మాట్లాడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నేను ఆంగ్లో ఇండియన్‌ కుటుంబానికి చెందిన అమ్మాయిని.

జయాపజయాలు మిమ్మల్ని కదిలిస్తాయా?
కచ్చితంగా. అయితే ఇప్పుడు అవన్నీ అధిగమించాను.

మెగాఫోన్‌ పట్టే అవకాశం ఉందా?
నిర్మాతగా మారాలనుంది గానీ, దర్శకత్వం జోలికి మాత్రం వెళ్లను.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement