విక్రమ్‌తో సింగిల్‌గానే రొమాన్స్ | Samantha Single Role in Vikram movie | Sakshi
Sakshi News home page

విక్రమ్‌తో సింగిల్‌గానే రొమాన్స్

Jun 11 2014 12:24 AM | Updated on Aug 28 2018 4:30 PM

విక్రమ్‌తో సింగిల్‌గానే రొమాన్స్ - Sakshi

విక్రమ్‌తో సింగిల్‌గానే రొమాన్స్

విక్రమ్‌తో సింగిల్‌గానే రొమాన్స్ చేస్తున్నట్లు నటి సమంత వెల్లడించారు. ఎవరేమన్నా ప్రస్తుతం మహా జోరుగా దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్ సమంతనే. విశేషమేమిటంటే కోలీవుడ్‌లో ఇప్పటి

 విక్రమ్‌తో సింగిల్‌గానే రొమాన్స్ చేస్తున్నట్లు నటి సమంత వెల్లడించారు. ఎవరేమన్నా ప్రస్తుతం మహా జోరుగా దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్ సమంతనే. విశేషమేమిటంటే కోలీవుడ్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా బోణీ కొట్టకపోయినా ప్రస్తుతం స్టార్ హీరోలు విజయ్, సూర్య, విక్రమ్‌ల సరసన ఏక కాలంలో జోడీ కడుతున్న లక్కీ నటి సమంత. ఇక టాలీవుడ్‌లో అయితే వరుస విజయాలను సొంతం చేసుకుంటూ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. కాగా ఈ చెన్నై చిన్నది విక్రమ్ సరసన పత్తు ఎండ్రదుక్కుళ్లయే చిత్రంలో నటిస్తున్నారు.
 
 గోలీసోడా ఫేమ్ దర్శకుడు, ప్రముఖ ఛాయాగ్రహకుడు విజయ్ విల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సమంత డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి సమంత స్పందిస్తూ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆయనతో సింగిల్‌గానే రొమాన్స్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుందని, తదుపరి షెడ్యూ ల్ త్వరలో ప్రారంభం కానుందని ఆమె తెలిపారు. అలాగే ప్రస్తుతం శృతిహాసన్, సమంతల మధ్యనే పోటీ కొనసాగుతోంది. ఈ ఇద్దరికీ తమిళం, తెలుగు భాషల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఈ రెండు భాషల హీరోలు వారినే హీరోయిన్లుగా కోరుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement