చైతూ చెప్పింది నాగురించి కాదు : సమంత | samantha replys fan comment in twitter | Sakshi
Sakshi News home page

చైతూ చెప్పింది నాగురించి కాదు : సమంత

May 13 2017 6:51 PM | Updated on Sep 5 2017 11:05 AM

చైతూ చెప్పింది నాగురించి కాదు : సమంత

చైతూ చెప్పింది నాగురించి కాదు : సమంత

అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంట సమంత.. చైతుగారు ఎదో అంటున్నారని ఓ అభిమాని పెట్టిన కామెంట్‌కు నటి సమంత బదులిచ్చింది.

హైదరాబాద్‌ :
అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంట సమంత.. చైతుగారు ఎదో అంటున్నారని ఓ అభిమాని పెట్టిన కామెంట్‌కు నటి సమంత బదులిచ్చింది. హ హా.. అవి నా గురించికాదు, మిగతా అమ్మాయిల గురించి అంటూ సమంత సరదాగా ట్వీట్‌ చేసింది.  నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమా థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది.

చైతూ సరసన రకుల్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి.  అయితే ఈ థియేట్రికల్ ట్రైలర్లో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.. అంటూ చైతూ ఓ డైలాగ్‌ చెబుతాడు. దీంతో చైతూకు కాబోయే భార్య, నటి సమంతకు ఓ అభిమాని అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంట.. చైతుగారు ఎదో అంటున్నారని ట్వీట్‌ చేశాడు. ఆ డైలాగ్‌ తన విషయంలో కాదులే అంటూ చైతూని సమర్థిస్తూ సమంత ట్వీట్‌ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement