ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ని స్వీకరించిన హీరోయిన్లు: వైరల్‌  | Samantha Reacted to Naga Chaitanya Fitness Challenge | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ని స్వీకరించిన హీరోయిన్లు: వైరల్‌ 

May 26 2018 2:02 PM | Updated on May 26 2018 5:02 PM

Samantha Reacted to Naga Chaitanya Fitness Challenge - Sakshi

సాక్షి, సినిమా : కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోడ్‌ విసిరిన ఫిట్‌నెస్ సవాల్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యవర్ధన్‌ సింగ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే చాలెంజ్‌‌ను సోషల్ మీడియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజ్యవర్ధన్‌తో మొదలై విరాట్‌, హృతిక్‌, అనుష్క శర్మ, పీవీ సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు. 

ఈ స‌వాల్ స్వీక‌రించిన అఖిల్ తాను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్‌ ధావన్‌ల‌కి ఈ స‌వాల్ విసిరాడు. వీరిలో చైతూ ముందుగా స్పందించి తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్ లో సమంత, నిధి అగర్వాల్ , సుశాంత్ లు పాల్గొనమని కోరాడు . దీనికి స్పందించిన స‌మంత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చాలెంజ్ స్వీక‌రిస్తున్నానని చెబుతూ ‘పుల్ అప్‌’ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ చాలెంజ్‌ను ఉపాస‌న కామినేనికొనిదెల‌, శిల్పారెడ్డి, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌కి విసురుతున్నాను అంటూ స‌మంత త‌న పోస్ట్‌లో పేర్కొంది. 

అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్లు లావణ్య త్రిపాఠీ, నేహ శర్మ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ ట్విటర్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు. వెన్నెల కిషోర్‌ ‘బాబాయ్‌ ఇసారి ఇంకొంచెం వేయిట్‌’ అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేసి నెటిజన్లని ఆకట్టుకుంటున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement