విశాల్‌తో సమంత | Samantha Pair's Up With Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌తో సమంత

Oct 6 2016 1:55 AM | Updated on Sep 4 2017 4:17 PM

విశాల్‌తో సమంత

విశాల్‌తో సమంత

సమంత, నటుడు విశాల్ తాజా హీరోయిన్లతో నటించాలని కోరుకుంటున్నట్లున్నారు.

సమంత, నటుడు విశాల్ తాజా హీరోయిన్లతో నటించాలని కోరుకుంటున్నట్లున్నారు. ఈ మధ్య ఒక చిత్రంలో నటించిన నాయకితో మరో చిత్రంలో నటించడం లేదు. ఇటీవల మరుదు చిత్రంలో నటి శ్రీదివ్యతో రొమాన్స్ చేశారు. ప్రస్తుతం నటిస్తున్న కత్తిసండై చిత్రంలో మిల్కీబ్యూటీ తమన్నాతో డ్యూయెట్లు పాడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో తప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నారు.
 
  ఇందులో దివంగత ప్రఖ్యాత నటుడు ఎస్‌ఎస్.రవిచంద్రన్ మనవరాలు తాన్యాను నాయకిగా ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. అదే విధంగా విశాల్ తదుపరి చిత్రానికి కూడా రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం. నవ దర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ఇరుంబుతిరై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
 
  ఈ చిత్రానికి తెరి చిత్రం ఫేమ్ జార్జ్ సి.విలియమ్స్ చాయాగ్రహణం, రుబీన్ కూర్పు బాధ్యతల్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందులో విశాల్‌కు జతగా నటి సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. సమంత త్వరలో శివకార్తికేయన్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారక పూర్వక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. విశేషం ఏమిటంటే వచ్చే ఏడాది లవర్ నాగచైతన్యతో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతూ తెలుగులో చిత్రాలను అంగీకరించని ఈ చెన్నై చిన్నది కోలీవుడ్‌లో మరోసారి ఒక రౌండ్ కొట్టడానికి రెడీ అవుతున్నారనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement