బాలీవుడ్‌కి బేబీ | Samantha Oh Baby going to Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కి బేబీ

Jun 4 2019 5:50 AM | Updated on Jun 4 2019 5:50 AM

Samantha Oh Baby going to Bollywood - Sakshi

బేబీ బాలీవుడ్‌కి వెళ్లనుంది. ఇక్కడ సమంత ఫొటో ఉంది కాబట్టి ఆమె హిందీ తెరకు పరిచయం కాబోతున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు.. సమంత నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’ హిందీలో రీమేక్‌ కానుంది. కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా బి. నందినీరెడ్డి దర్శకత్వం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్‌ పిక్చర్స్‌ సంస్థలు నిర్మించాయి, సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్‌ కీలకపాత్రలు చేసిన ఈ చిత్రం ఈ 5న విడుదల కానుంది. ‘ఓ బేబీ’ని హిందీలో నిర్మించాలనుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. అక్కడి ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత డి. సురేష్‌బాబు బాలీవుడ్‌కి చెందిన ఓ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement