రెడీ... స్టార్ట్! | Samantha, Nithya team up with NTR in 'Janatha Garage' | Sakshi
Sakshi News home page

రెడీ... స్టార్ట్!

Feb 21 2016 10:46 PM | Updated on Sep 3 2017 6:07 PM

రెడీ... స్టార్ట్!

రెడీ... స్టార్ట్!

‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో చిన్న ఎన్టీఆర్ క్లాస్ లుక్‌లో అభిమానులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’లో...

‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో చిన్న ఎన్టీఆర్ క్లాస్ లుక్‌లో అభిమానులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’లో మాస్‌గా రెచ్చిపోనున్నారు.  కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు. నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. ఇందులో సమంత, నిత్యామీనన్ కథానాయికలు. మలయాళ నటుడు మోహన్‌లాల్ చాలాకాలం తర్వాత నటిస్తున్న తెలుగు చిత్రమిదే. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘నేటి నుంచి ఆర్‌ఎఫ్‌సీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.

తదుపరి సారథి స్టూడియోస్‌లో నిర్మించిన మూడు కోట్ల విలువైన సెట్‌లో జరుపుతాం. ఆ తర్వాత చెన్నై, ముంబై, కేరళలలో చిత్రీకరించి, ఆగస్టు 12న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి.

Advertisement
 
Advertisement
Advertisement