వామ్మో.. సమంత 72 కేజీలు ఎత్తేసింది | Samantha Lifting 72KG Heavy Weights at Gym | Sakshi
Sakshi News home page

వామ్మో.. సమంత 72 కేజీలు ఎత్తేసింది

Nov 5 2016 11:27 AM | Updated on Sep 4 2017 7:17 PM

వామ్మో.. సమంత 72 కేజీలు ఎత్తేసింది

వామ్మో.. సమంత 72 కేజీలు ఎత్తేసింది

ఈ మధ్య సినిమాలతో కన్నా తన పెళ్లి వార్తలతోనే ఎక్కువగా సందడిచేస్తున్న సమంత, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గా ఉంటోంది. ముఖ్యంగా త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకుంటున్నట్టుగా...

ఈ మధ్య సినిమాలతో కన్నా తన పెళ్లి వార్తలతోనే ఎక్కువగా సందడిచేస్తున్న సమంత, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గా ఉంటోంది. ముఖ్యంగా త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించిన తరువాత ఈ బ్యూటి మరింత జోరు పెంచింది. వరుసగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

అయితే అలా అప్ లోడ్ చేస్తున్న ఫోటోలలో ఎక్కువగా జిమ్లో తీసిన ఫోటోలే ఉండటం విశేషం. గతంలో నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. తరువాత స్పోర్ట్స్ డ్రెస్ లో ఊయ్యల ఊగుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది సామ్. తాజాగా భారీ బరువుల ఎత్తుతున్న వీడియో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన జెస్సీ అందరికీ షాక్ ఇచ్చింది.

అక్కినేని ఫ్యామిలీ ఇన్సిపిరేషన్ తో హెల్త్, బాడీ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సమంత ఎక్కువ సమయం జిమ్ లోనే గడిపేస్తున్నట్టుగా ఉంది. అందుకే ఏకంగా 72 కేజీల బరువుతో కసరత్తులు చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. సమంత పోస్ట్ చేసిన ఈ వీడియోపై సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెద్ద సంఖ్యలో రియాక్ట్ అవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement