మాయాబజార్‌లో మిసెస్‌ నాగచైతన్య! | samantha to join mahanati shooting in monday | Sakshi
Sakshi News home page

మాయాబజార్‌లో మిసెస్‌ నాగచైతన్య!

Oct 17 2017 2:04 AM | Updated on Oct 17 2017 4:31 AM

samantha to join mahanati shooting in monday

జస్ట్‌... తొమ్మిదంటే తొమ్మిది రోజుల క్రితమే సమంత రూత్‌ ప్రభు... అక్కినేని సమంతగా మారారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కి చెక్కేయకుండా నాగచైతన్య, సమంత తమ తమ సినిమాల షూటింగ్స్‌కి డేట్స్‌ ఇచ్చేశారు. సమంత అయితే నిన్న మొన్నటి వరకు ‘రాజుగారి గది 2’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. సోమవారం ‘మహానటి’ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు.

ప్రొఫెషన్‌ మీద అంత శ్రద్ధ కాబట్టే్ట, ఆమె టాప్‌ హీరోయిన్‌ అయ్యారు. ‘మహానటి’ సంగతికొస్తే... అలనాటి గొప్ప నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగఅశ్విన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటి క్లాసిక్‌ ‘మాయాబజార్‌’లో సావిత్రి చేసిన శశిరేఖ పాత్రకు సంబంధించిన సీన్స్‌ని తీస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు.

సమంత జర్నలిస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఉదయాన్నే ‘మహానటి’ షూట్‌లో జాయిన్‌ అయ్యేందుకు స్టార్ట్‌ అయ్యాను. నెర్వస్‌గా, ఎగై్జట్‌మెంట్‌గా ఉంది. న్యూ బిగినింగ్‌’’ అని సమంత పేర్కొన్నారు. కథానాయిక అయ్యి దాదాపు ఏడేళ్లయింది. ఇప్పుడు న్యూ బిగినింగ్‌ ఏంటీ అనుకుంటున్నారా? అప్పుడు ‘కుమారి సమంత’గా సెట్స్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ‘మిసెస్‌ నాగచైతన్య’గా వెళుతున్నారు కదా. అందుకే అలా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement