శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు రెడీ | samantha going to do another tamil film with sivakarthikeyan | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు రెడీ

Jun 10 2017 2:14 AM | Updated on Sep 5 2017 1:12 PM

శివకార్తికేయన్‌తో  రొమాన్స్‌కు రెడీ

శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు రెడీ

చెన్నై చిన్నది సమంత శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు.

చెన్నై చిన్నది సమంత శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఒక పక్క సినిమాలు, మరో పక్కపెళ్లి కార్యక్రమాలతో యమ బిజీగా ఉన్నారు నటి సమంత. ఈ బ్యూటీ టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి నాగచైతన్య అక్టోబర్‌ 6 అంటూ ముహూర్తం కూడా వెల్ల డించేశారు.

కాగా ఇటీవల విజయ్‌కు జంటగా ఆయన 61వ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న సమంత మరో పక్క తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటిస్తున్నారు. తాజాగా శివకార్తికేయన్‌తో మరో తమిళ చిత్రం చేసేయడానికి రెడీ అయిపోతున్నారు. అవును వారి తొలి కాంబినేషన్‌లో చిత్రం ఈ నెల 16న ప్రారంభం కానుందన్న తాజా సమాచారం. వరుస విజయాలతో జోరు మీదున్న శివకార్తికేయన్‌ ప్రస్తుతం వేలైక్కారన్‌ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం మరో పది రోజుల ప్యాచ్‌వర్క్‌తో పూర్తి అవుతుంది.

దీంతో శివకార్తికేయన్‌ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అంతకుముందు పొన్‌రాం దర్శకత్వంలో నటించనున్నారు. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిభర్‌సంఘం, రజనీమురుగన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన పొన్‌రాం మూడోసారి ఆయనతో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అదే విధంగా రెమో, వేలైక్కారన్‌ చిత్రాలను నిర్మించిన ఆర్‌డీ.రాజానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటి సమంత నాయకిగా నటించనున్నారు. డి.ఇమాన్‌ ఇప్పటికే పాటలకు బాణీలు కట్టే పనిలో బిజీగా ఉన్నారట. సమంత పెళ్లికి ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement