సీక్రెట్‌ టాటూ రివీల్‌ చేసిన సమంత! | Samantha Akkineni Reveals Secret Tattoo | Sakshi
Sakshi News home page

నా భర్తే నా ప్రపంచం : సమంత

Jul 8 2019 2:39 PM | Updated on Jul 8 2019 2:45 PM

Samantha Akkineni Reveals Secret Tattoo - Sakshi

నా భర్త చై నా ప్రపంచం

వివాహానంతరం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు హీరోయిన్‌ సమంత. వైవిధ్యమైన పాత్రలు ఎన్నుకుంటూ నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. నిజానికి పెళ్లి తర్వాతే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఆమెను ఎక్కువగా వరిస్తున్నాయి. ఇటీవల తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న సామ్‌.. శుక్రవారం విడుదలైన ఓ బేబీ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వసూళ్లలో దుసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో సమంత వైట్‌డ్రెస్‌లో తళుక్కుమన్నారు. ఈ క్రమంలో ఫొటోషూట్‌లో పాల్గొన్న సమంత సోషల్‌మీడియా వేదికగా తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. ‘  అత్యుత్తమ జీవితాన్ని గడుపుతున్నాను... ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం’ అంటూ తన భర్త పేరుతో ఉన్న టాట్టూను రివీల్‌ చేశారు. ఈ క్రమంలో సమంత ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటో... సామ్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. లక్షల్లో లైకులు సాధిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement