హలో... గెస్ట్స్‌! | Samantha Akkineni, Amala and Nagarjuna’s cameos in Akhil’s Hello | Sakshi
Sakshi News home page

హలో... గెస్ట్స్‌!

Nov 28 2017 12:38 AM | Updated on Jul 15 2019 9:21 PM

Samantha Akkineni, Amala and Nagarjuna’s cameos in Akhil’s Hello - Sakshi - Sakshi

హలో అవినాష్‌ అని పలకరించడానికి నాగార్జున, అమల, సమంత రెడీ అయ్యారని సమాచారం. అవినాష్‌ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖిల్‌ అక్కినేని పేరే అవినాష్‌. ‘హలో’లో తను చేస్తోన్న క్యారెక్టర్‌ పేరిది. సినిమాలో అవినాష్‌కి నాగ్, అమల, సామ్‌ హలో చెబుతారట. అంటే.. గెస్టులుగా కనిపిస్తారని సమాచారం. ఆల్రెడీ ‘మనం’ అక్కినేని ఫ్యాన్స్‌కు మంచి పండగ.

‘హలో’లో గెస్ట్‌ రోల్స్‌ నిజమైతే ఫ్యాన్స్‌కు మరోసారి ఐ–ఫీస్ట్‌ గ్యారంటీ అని చెప్పొచ్చు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి కథానాయికగా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి, టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement