ప్రేమకు వందనం | Salute to love | Sakshi
Sakshi News home page

ప్రేమకు వందనం

Sep 29 2015 12:01 AM | Updated on Sep 3 2017 10:08 AM

ప్రేమకు వందనం

ప్రేమకు వందనం

ప్రేమలో మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘వందనం’.

ప్రేమలో మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో కందిమల్ల చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమించుకుని పెళ్లి చేసుకునేది ఒక కోణమైతే, ప్రేమించుకుని విడిపోయి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం రెండో కోణం.

మరి మూడో కోణం ఏంటనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’’ అని చెప్పారు. ‘‘అక్టోబరు 10న పాటలను, నవంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.పి, కెమెరా: సూర్య, సమర్పణ: కందిమల్ల పద్మావతి.
 

Advertisement
 
Advertisement
Advertisement