breaking news
Malavika Menon
-
ఛాన్సుల కోసమే అలాంటి పని చేయడం లేదు: నటి
వెండితెరపై గ్లామర్‌గా నటించడం తప్పా అని చాలా మంది కథానాయికలు ప్రశ్నించారనే విషయం తెలిసిందే. ఇప్పుడు మలయాళ నటి 'మాళవిక మీనన్'(Malavika Menon) కూడా అదే అడుగుతోంది. తమిళ, మలయాళ చిత్రాల్లో ఈ కేరళా కుట్టికి భారీగానే అభిమానులు ఉన్నారు. దీంతో మాతృభాషలో నటిస్తూనే కోలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తెలుగులో కూడా 'అమ్మాయిలు అంటే అదో రకం, వందనం' అనే రెండు చిత్రాలతో తన లక్‌ను చూసుకుంది. కానీ, ఇక్కడ అనుకున్నంతగా ఛాన్సులు రాలేదు. కానీ, మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ అమ్మడు తమిళంలో ఇవన్ వేర మాదిరి, విళా, బ్రహ్మన్, వెత్తువెట్టు, నిజమానిళలా వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అయితే ఈ బ్యూటీ చిత్రాలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కుర్రక్రారును ఆకట్టుకుంటుంది. దీంతో చిత్రాల్లో పక్కింటి అమ్మాయిగా కనిపించే మాళవిక మీనన్ గ్లామర్‌గా మారడానికి కారణం అవకాశాల కోసమా? అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారని పేర్కొంది. అయితే అలాంటిదేమీ లేదని చెప్పింది. అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేంటి అని ప్రశ్నించింది. మలయాళ చిత్రాల్లో గ్లామర్‌గా నటించే అవకాశం ఉండదని, తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో అలా నటించవచ్చునని పేర్కొంది. అయినా సామాజిక మాధ్యమాల్లో తన గ్లామరస్ ఫొటోల గురించి అడుగుతున్నారని, తాను మాత్రమే అలా చేస్తున్నానా అని ప్రశ్నించింది. అయినా ఫేక్ అకౌంట్లతో అవాస్తవాలు రాస్తూ ముఖం చూపడానికి భయపడే వారు సామాజిక మాధ్యమాల్లో తన గురించి ఉన్నవి, లేనివి ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదనే అభిప్రాయాన్ని మాళవిక వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) -
నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న మాటను సెలబ్రిటీలు తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా వివిధ కార్యక్రమాలు, షోరూమ్‌ల ప్రారంభోత్సవానికి వెళ్తుంటారు. మలయాళ హీరోయిన్ మాళవిక మీనన్ (Malavika C Menon) కూడా ఇదే చేస్తోంది. అయితే అదే పనిగా వరుసపెట్టి కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నందుకు కొందరు విమర్శలు కూడా గుప్పించారు. సినిమాల్లో మంచి పాత్రల కోసం ఆరాటపడకుండా ఇలా ప్రోగ్రామ్‌ల వెనక పరిగెట్టడం దేనికని బుగ్గలు నొక్కుకున్నారు. ఎన్ని ఖర్చులుంటాయనుకున్నారు!అయితే ఇలాంటి ప్రోగ్రామ్‌లకు వెళ్తే వచ్చే డబ్బు తనకు ఖర్చులకే సరిపోతోందని చెప్తోంది మాళవిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒక కార్యక్రమానికి వెళ్లాలంటే నువ్వు చాలా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. మొదట నీ దుస్తుల కోసం.. తర్వాత నువ్వు ప్రయాణించడానికి ఓ వాహనం కావాలి. అందులోనూ అమ్మాయైతే ఆ ఖర్చు రెట్టింపవుతుంది. మేకప్ సామాను కొనుక్కోవాలి, డ్రెస్సులు కొనుగోలు చేయాలి. దానిపైకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కొనాలి.(చదవండి: నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?)కెరీర్ మొదట్లో ఇబ్బందిపడ్డా..కొన్నిసార్లు మనమే రెడీ అయినా సమయం లేకపోతే మేకప్ ఆర్టిస్టును పిలిపించుకోవాలి. అలాగే హెయిర్ స్టయిలిస్ట్. కొన్నిసార్లు మన లుక్ సరిగ్గా ఉండేందుకు స్టయిలిస్ట్ అవసరం కూడా ఉండొచ్చు. వీళ్లందరికీ మనం డబ్బులివ్వాలిగా! తమ పనిని వదిలేసుకుని వచ్చినందుకు వారి డిమాండ్‌ను బట్టి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెలింగ్ ఖర్చులు ఉండనే ఉన్నాయి. కెరీర్ మొదట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డాను.ప్రతి పైసాను గౌరవిస్తా..ఆ సమయంలో కుటుంబమే నా అవసరాలు తీర్చింది. నేను వెనకడుగు వేయకుండా ప్రోత్సహించింది. కొన్నిసార్లు ఇంట్లోనూ పరిస్థితులు కఠినంగా ఉండేవి కానీ అవి నాకు తెలియనిచ్చేవారు కాదు. ఒకసారైతే నేను కనుబొమ్మలు గీయించుకోవడానికి కూడా డబ్బులేదు. ఇప్పుడా పరిస్థితి మారింది. అందుకే ప్రతి పనిని, ప్రతి పైసాను గౌరవిస్తాను. తెరపై సెలబ్రిటీలను చూసి వారిది రంగుల జీవితం అనుకుంటాం కానీ అలా ఏం ఉండదు. వాళ్లకూ ఎన్నో కష్టాలుంటాయి. ఏదీ శాశ్వతం కాదునేను కూడా ఎన్నోసార్లు అవమానాలకు గురయ్యాను. అయితే ఏదీ శాశ్వతం కాదని బలంగా నమ్ముతూ ముందడుగు వేస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. నిద్ర, హీరో, నాదన్, నదేవయానం, ఎంజన్ మరికుట్టి, జోసెఫ్, మామంగం, ఏఐ మల్లు, పెయి మామ వంటి పలు మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో లవ్ కె రన్, అమ్మాయిలు అంతే అదో టైప్ సినిమాలు చేసింది.చదవండి: నాకు పుట్టబోయే పిల్లల్ని కూడా వదల్లేదు: ప్రియమణి -
Malavika Menon: మలయాళీ బ్యూటీ మాళవిక మీనన్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లోనూ నటిస్తా : మలయాళ బ్యూటీ
‘‘నేను మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. అయితే ఇప్పటివరకు ముద్దు సన్నివేశాలు చేయలేదు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు, ముద్దు సన్నివేశాలు చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటున్నారు హీరోయిన్ మాళవికా మీనన్. అందం, అభినయంతో దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మలయాళ బ్యూటీ. తెలుగులో మాళవికా మీనన్ ‘లవ్ కే రన్’ (2016), ‘అమ్మాయిలు అంతే అదో టైపు’ (2018) వంటి చిత్రాల్లో నటించారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమాలు ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఆమె నటించిన మలయాళ సినిమాలు ‘తంగమణి, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కొచ్చి’ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘నేను మొదటిసారి నటించిన మలయాళ చిత్రం ‘నిద్ర’ (2011). అందులో హీరో చెల్లెలి పాత్ర చేశాను. అప్పుడు నా వయసు 14 ఏళ్లు. ‘916’ (2012) అనే మలయాళ మూవీ ద్వారా కథానాయికగా పరిచయమయ్యాను. మలయాళ సినిమాల్లో గ్లామర్ పాత్రలకు అవకాశం ఉండదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఆ అవకాశాలు బాగుంటాయి... ఈ రెండు భాషల్లోనూ గ్లామరస్ హీరోయిన్గా నటించడానికి స్కోప్ ఉంటుంది’’ అన్నారు. -
మిర్చీలాంటి మాళవిక.. మెరిసిపోతున్న వర్షిణి
► భార్యతో క్యూట్ మూమెంట్ షేర్ చేసుకున్న విక్కీ కౌశల్ ► బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న వర్షిణి ► పూలడ్రెస్లో సదా చిరునవ్వులు ► హాట్ మిర్చీలాంటి మాళవిక మీనన్ అందాలు ► పప్పీతో నాజ్రియా బ్యూటిఫుల్ ఫోటో ► యూట్యూబ్ ఛానెల్‌ను లాంచ్ చేసిన మేఘనా View this post on Instagram A post shared by Bindu Madhavi🦋 (@bindu_madhavii) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Malavika✨ (@malavikacmenon) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
షూటింగ్లో హీరో శ్రీకాంత్‌తో నాకు గొడవ అయ్యింది : హీరోయిన్
'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మాళవిక. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. సుమారు12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మాళవిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. రీసెంట్‌గానే పుష్ప సినిమా చూశానని, అందులో సమంత చేసినట్లు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది. ఇక ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా బాగుంది సినిమాలో హీరో శ్రీకాంత్‌కి, గొడవ జరిగిందని తెలిపింది. 'ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవడంతో నాకు అంత కంఫర్ట్ లేదని చెప్పాను. దీంతో శ్రీకాంత్ షూటింగ్ మధ్యలోంచి వెళ్లిపోయారు. ఇక ఈ సినిమాలో అత్యాచారం సీన్లో నటించినందుకు ఇప్పటికీ చాలా డిస్ట్రబ్‌గా అనిపిస్తుంది. హిందీలో కూడా సీయూ ఎట్9 చిత్రంలో ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడంతో పేరెంట్స్ కోప్పడ్డారు. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా' అని మాళవిక చెప్పుకొచ్చింది. -
రాజకీయాల్లో సాధారణమే!
తమిళసినిమా: రాజకీయాల్లో ఇదంతా సాధారణమయ్యా! (అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా) పేరుతో ఒక విభిన్న కథా చిత్రం రూపొందింది. ఇందులో రాజతందిరం చిత్రం ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందిన వీరా కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా కూక్కూ చిత్రం ఫేం మాళవిక మీనన్ కథానాయకిగా నటించింది. చాలా చిత్రాలను నిరాకరించిన ఈమె ఈ చిత్ర కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. వాణిజ్య ప్రకటన రంగంలో పేరు గాంచిన అవినాశ్ హరిహరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పంపిణీ రంగంలో నమ్మకమైన సంస్థగా పేరు గాంచిన ఆరా సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా. ఈ సంస్థ అధర్వ, హన్సిక జంటగా 100 అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే విధంగా త్వరలో ఆది హీరోగా తెలుగులో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని రీమేక్ చేయనుంది. కాగా అరసియలిల్ ఇదెల్లాం సాధారణమప్పా చిత్ర వివరాలను నిర్మాత కావ్య వేణుగోపాల్ తెలుపుతూ ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. చిత్రం గురించి తెలిసిన వెంటనే క్లాప్‌బోర్డు సంస్థ అధినేత సత్యమూర్తి తమిళనాడు విడుదల హక్కులను పొందారన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెలాఖరున లేదా, సెప్టెంబరు తొలివారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో నటుడు పశుపతి, రోబోశంకర్, నాన్ కడవుల్ రాజేంద్రన్, సేతన్, షారా ముఖ్య పాత్రలను పోషించారు. మ్యాడ్లీ బ్లూస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహణ బాధ్యతలు చేపడుతున్నారు.. -
తొందరపాటు నిర్ణయం
‘‘డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తొందరపాటులో ఓ నిర్ణయం తీసుకోవడం వల్ల తండ్రి ప్రేమకి దూరమవుతుంది. ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఏంటి? తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి? తండ్రికి దగ్గరయిందా? లేదా?’’ అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘అమ్మాయిలంతే అదో టైపు’. గోపీ వర్మ, మాళవికా మీనన్, శివాజీ రాజా ముఖ్య తారలుగా కృష్ణమ్ దర్శకత్వంలో గాయత్రి రీల్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. కృష్ణమ్ మాట్లాడుతూ– ‘‘భావోద్వేగాలే హైలెట్‌గా తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. నేటి యువతరం, తల్లిదండ్రుల ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటలు, అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్. -
ఆ సినిమాతో నా స్థాయి పెరుగుతుంది
తమిళసినిమా: అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నా స్థాయిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది నటి మాళవికనాయర్.పూర్తి డిజిటల్ సినిమాను సిలంది చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు ఆదిరాజన్. ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం అరువాసండై. ఒక కబడ్డీ క్రీడాకారుడి ప్రేమ ఇతివృత్తాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో నిజ కబడ్డీ క్రీడాకారుడు రాజా హీరోగా పరిచయం కావడం విశేషం. కాగా నాయకిగా మాళవిక మీనన్ నటిస్తున్నారు. ఈ అమ్మడు ఇంతకు ముందు బ్రహ్మ చిత్రంలో శశికుమార్‌కు చెల్లెలిగానూ, ఇవన్ వేరమాదిరి చిత్రంలో సురభికి చెల్లెలిగానూ నటించింది.విళా చిత్రం ద్వారా నాయకిగా పరిచయమైన మాళవిక మీనన్ ప్రస్తుతం మలయాళంలో ఐదు చిత్రాలు, తెలుగులో రెండు చిత్రాలు అంటూ బిజీగా నటిస్తోంది. వెట్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి చిత్ర నాయకి మాళవిక మీనన్ స్పందిస్తూ, ఈ చిత్ర కథ వినగానే చాలా ఆసక్తిని రేకెత్తించిందని పేర్కొంది. ముఖ్యంగా దర్శకుడు క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు కళ్లంబట నీరు వచ్చిందని చెప్పింది. అరువాసండై చిత్రం కోలీవుడ్‌లో నటిగా తన స్థాయిని పెంచే చిత్రం అవుతుందని అంది. మరో విషయం ఏమిటంటే పెద్ద హీరోల మాదిరి ఈ చిత్రంలో తనకు ఓపెనింగ్ సాంగ్ ఉండడం డబుల్ సంతోషం అని మాళవిక మీనన్ పేర్కొంది. -
అంతే.. అదో టైప్
గోపీరంగా, మాళవికా మీనన్, శివాజీ రాజా ముఖ్య పాత్రల్లో కృష్ణం దర్శకత్వంలో గాయత్రి రీల్స్ పతాకంపై వై.వి.ఎస్.ఎస్.ఆర్. కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మాయి లంతే...అదోౖ టెపు’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి ప్రేమ కథా చిత్రం. సంపన్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, ఆటో డ్రైవర్ని ప్రేమిస్తుంది. తన తండ్రి గౌరవం కంటే ప్రేమే ముఖ్యమంటూ ప్రియుడితో కలిసి హైదరాబాద్‌కి వెళ్తుంది. అప్పుడు ఆ తండ్రి కూతురు కోసం ఎటువంటి తపన పడ్డాడు? తన తొందరపాటు నిర్ణయం వల్ల తండ్రి ప్రేమకి దూరమయ్యాన ంటూ కూతురు పడే బాధ ఏంటి? ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనే భావోధ్వేగాల మధ్య కథ సాగుతుంది. జనవరిలో పాటలు, సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్. -
దీపక్‌లో మంచి నటుడున్నాడు
‘‘చిన్న సినిమాలకు ఇదొక ట్రెండ్ సెట్టర్ కావాలని ఆశిస్తున్నాను. ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. దీపక్‌లో మంచి నటుడున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని సీనియర్ నటి జయప్రద అన్నారు. దీపక్ సరోజ్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో వెంకట చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘వందనం’. జె.పి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. కొత్తగా ఉంది. దీపక్ బాగా నటించాడు. తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. దీపక్ మాట్లాడుతూ-‘‘ ‘లెజెండ్’, ‘మిణుగురులు’ చిత్రాలు నాకు మంచి పేరు తె చ్చిపెట్టాయి. నాకు హీరో అనిపించుకోవడం కన్నా, మంచి నటుడు అనిపించుకోవడం ఇష్టం. ఈ పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నా’’ అని అన్నారు. ఈ వేడుకలో నటుడు సుమన్, నిర్మాతలు ఎం.ఎల్. కుమార్ చౌదరి, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమకు వందనం
ప్రేమలో మూడో కోణాన్ని ఆవిష్కరిస్తూ అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో కందిమల్ల చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమించుకుని పెళ్లి చేసుకునేది ఒక కోణమైతే, ప్రేమించుకుని విడిపోయి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం రెండో కోణం. మరి మూడో కోణం ఏంటనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’’ అని చెప్పారు. ‘‘అక్టోబరు 10న పాటలను, నవంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.పి, కెమెరా: సూర్య, సమర్పణ: కందిమల్ల పద్మావతి. -
సేవ్ లవ్..!
ప్రేమించుకుని పెళ్లి చేసుకునేవాళ్లు ఒక తరహా అయితే, పెద్దలు ఒప్పుకోలేదని విడిపోయే ప్రేమికులు మరో తరహా. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా కందిమల్ల మూవీమేకర్స్ పతాకంపై కందిమల్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోటపాటి శ్రీను దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ‘సేవ్ లవ్’ అనే నినాదం చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. ఈ నెలాఖరులో పాటలను, జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: స్వర్ణ సుధాకర్, సమర్పణ: కందిమల్ల పద్మావతి.


