అంతే.. అదో టైప్‌ | ammayilante adho type in post-production | Sakshi
Sakshi News home page

అంతే.. అదో టైప్‌

Dec 27 2016 12:29 AM | Updated on Sep 4 2017 11:39 PM

అంతే.. అదో టైప్‌

అంతే.. అదో టైప్‌

గోపీరంగా, మాళవికా మీనన్, శివాజీ రాజా ముఖ్య పాత్రల్లో కృష్ణం దర్శకత్వంలో గాయత్రి రీల్స్‌ పతాకంపై వై.వి.ఎస్‌.ఎస్‌.ఆర్‌. కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మాయి లంతే...అదోౖ టెపు’.

గోపీరంగా, మాళవికా మీనన్, శివాజీ రాజా ముఖ్య పాత్రల్లో కృష్ణం దర్శకత్వంలో గాయత్రి రీల్స్‌ పతాకంపై వై.వి.ఎస్‌.ఎస్‌.ఆర్‌. కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మాయి లంతే...అదోౖ టెపు’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి ప్రేమ కథా చిత్రం. సంపన్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, ఆటో డ్రైవర్‌ని ప్రేమిస్తుంది. తన తండ్రి గౌరవం కంటే ప్రేమే ముఖ్యమంటూ ప్రియుడితో కలిసి హైదరాబాద్‌కి వెళ్తుంది. అప్పుడు ఆ తండ్రి  కూతురు కోసం ఎటువంటి తపన పడ్డాడు? తన తొందరపాటు నిర్ణయం వల్ల తండ్రి ప్రేమకి దూరమయ్యాన ంటూ కూతురు పడే బాధ ఏంటి? ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనే భావోధ్వేగాల మధ్య కథ సాగుతుంది. జనవరిలో పాటలు, సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement