కొత్త అనుభూతిని పంచేలా ‘డైమండ్‌ డెకాయిట్‌’ | Diamond Dacoit Trailer Released | Sakshi
Sakshi News home page

కొత్త అనుభూతిని పంచేలా ‘డైమండ్‌ డెకాయిట్‌’

Apr 5 2026 5:07 PM | Updated on Apr 5 2026 5:44 PM

Diamond Dacoit Trailer Released

పార్థ గోపాల్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ డెకాయిట్‌’. సూర్య జి. యాదవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్‌. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.. ఈ చిత్రం టైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వాకాడ అప్పారావు, నిర్మాత శిరీష్‌ రెడ్డి, నటుడు శివాజీ రాజా పాల్గొని, ‘డైమండ్‌ డెకాయిట్‌’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

పార్ధ గోపాల్‌ మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్‌... ఇలా అన్నీ కలిసిన పూర్తి ఎంటర్‌టైనర్‌ ‘డైమండ్‌ డెకాయిట్‌’. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని తెలిపారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో మా సినిమా తీశాం. థియేటర్‌లో వీక్షించి, యూనిట్‌ని సపోర్ట్‌ చేయాలి’’ అని సూర్య జి. యాదవ్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement