వామ్మో జ్యోతిక.. ఆ జిమ్ వర్కవుట్స్ ఏంటి? | kollywood actress Jyotika gym video goes viral oin social media | Sakshi
Sakshi News home page

Jyothika: వామ్మో జ్యోతిక.. ఆ జిమ్ వర్కవుట్స్ ఏంటి?

Apr 5 2026 5:36 PM | Updated on Apr 5 2026 5:50 PM

kollywood actress Jyotika gym video goes viral oin social media

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య సతీమణి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. 1997లో  హిందీ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అజిత్‌ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. తమిళంతో పాటు తెలుగు,హిందీ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్‌ గ్రీన్‌ హీరోయిన్‌గా తన కెరీర్‌లో దూసుకెళ్లింది. ఆ తర్వాత 2006లో సూర్యను పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ.  సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్‌ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరి పిల్లలు ముంబయిలో చదువుతున్నారు.

ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా.. జ్యోతిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా తన జిమ్‌ వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసింది. ఇందులో పలు రకాల కసరత్తులు చేస్తూ జ్యోతిక కనిపించింది. ఈ స్టన్నింగ్ వర్కవుట్స్ చూస్తుంటే జ్యోతిక ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం జ్యోతిక రెండు వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement