సంతోశ్ శోభన్ రాకాస.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | santosh shobhan rakasa movie day 2 collections | Sakshi
Sakshi News home page

Rakasa Movie: సంతోశ్ శోభన్ రాకాస.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Apr 5 2026 4:18 PM | Updated on Apr 5 2026 4:22 PM

santosh shobhan rakasa movie day 2 collections

మ్యాడ్ హీరో సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా  నటించిన మరో సినిమా 'రాకాస'. ఈ సినిమాను నిహారిక తన సొంత బ్యానర్‌ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ మూవీతో మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రిలీజైంది.

ఈ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. రెండో రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొనసాగించింది. వీకెండ్ కలిసి రావడంతో రెండు రోజుల్లో రూ.10.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పోస్టర్‌ రిలీజ్ చేసింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement