తొందరపాటు నిర్ణయం | Ammailanthe Adho Type is under post production works | Sakshi
Sakshi News home page

తొందరపాటు నిర్ణయం

Sep 18 2017 1:09 AM | Updated on Sep 19 2017 4:41 PM

తొందరపాటు నిర్ణయం

తొందరపాటు నిర్ణయం

‘‘డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తొందరపాటులో ఓ నిర్ణయం తీసుకోవడం వల్ల తండ్రి ప్రేమకి దూరమవుతుంది.

‘‘డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి తొందరపాటులో ఓ నిర్ణయం తీసుకోవడం వల్ల తండ్రి ప్రేమకి దూరమవుతుంది.  ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఏంటి? తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి? తండ్రికి దగ్గరయిందా? లేదా?’’ అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘అమ్మాయిలంతే అదో టైపు’.

గోపీ వర్మ, మాళవికా మీనన్, శివాజీ రాజా ముఖ్య తారలుగా కృష్ణమ్‌ దర్శకత్వంలో గాయత్రి రీల్స్‌ పతాకంపై రూపొందిన చిత్రమిది. కృష్ణమ్‌ మాట్లాడుతూ– ‘‘భావోద్వేగాలే హైలెట్‌గా తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. నేటి యువతరం, తల్లిదండ్రుల ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటలు, అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్‌ నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement