దీపక్‌లో మంచి నటుడున్నాడు | Deepak Saroj to Debut Tollywood with Vandanam Movie | Sakshi
Sakshi News home page

దీపక్‌లో మంచి నటుడున్నాడు

Oct 12 2015 12:11 AM | Updated on Sep 3 2017 10:47 AM

దీపక్‌లో మంచి నటుడున్నాడు

దీపక్‌లో మంచి నటుడున్నాడు

చిన్న సినిమాలకు ఇదొక ట్రెండ్ సెట్టర్ కావాలని ఆశిస్తున్నాను. ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. దీపక్‌లో మంచి నటుడున్నాడు.

 ‘‘చిన్న సినిమాలకు ఇదొక ట్రెండ్ సెట్టర్ కావాలని ఆశిస్తున్నాను. ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. దీపక్‌లో మంచి నటుడున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని సీనియర్ నటి జయప్రద అన్నారు. దీపక్ సరోజ్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో వెంకట చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘వందనం’. జె.పి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ     -‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను.
 
 కొత్తగా ఉంది. దీపక్ బాగా నటించాడు. తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. దీపక్ మాట్లాడుతూ-‘‘ ‘లెజెండ్’, ‘మిణుగురులు’ చిత్రాలు నాకు మంచి పేరు తె చ్చిపెట్టాయి. నాకు హీరో అనిపించుకోవడం కన్నా, మంచి నటుడు అనిపించుకోవడం ఇష్టం. ఈ పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నా’’ అని అన్నారు. ఈ వేడుకలో నటుడు సుమన్, నిర్మాతలు ఎం.ఎల్. కుమార్ చౌదరి, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement