పీకేను బీట్‌ చేసిన టైగర్‌

Salman Khan's Tiger Zinda Hai beats Aamir Khans PK - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌లు నటించిన టైగర్‌ జిందా హై వసూళ్లలో దుమ్మురేపింది. 2012లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఏక్‌ థా టైగర్‌కు సీక్వెల్‌గా వచ్చిన టైగర్‌ బాక్సాఫీస్‌ వద్ద గట్టిగానే గర్జించింది. ఓవరాల్‌ వసూళ్లలో ఈ మూవీ హిందీ మూవీస్‌లో అమీర్‌ఖాన్‌ నటించిన పీకేను వెనక్కినెట్టి టాప్‌ 3 ప్లేస్‌ను ఆక్రమించింది.

ప్రముఖ మూవీ విశ్లేషకులు రమేష్‌ బాల ఈ విషయం వెల్లడిస్తూ ట్వీట్‌ చేశారు. అత్యధిక నెట్‌ వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో బాహుబలి 2 అగ్రస్ధానంలో ఉండగా, దంగల్‌ రెండో స్ధానంలో, టైగర్‌ జిందా హై మూడవ స్ధానంలో నిలిచాయని చెప్పారు. పీకే నాలుగోస్ధానంలో భజరంగీభాయ్‌జాన్‌ టాప్‌ 5లో చోటుదక్కించుకున్నాయని తెలిపారు. టైగర్‌ జిందా హై ఇప్పటికే గత ఏడువారాల్లో రూ 339 కోట్ల వసూళ్లు రాబట్టి సల్మాన్‌ మూవీల్లో అత్యధిక గ్రాసర్‌గా నిలిచింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top