హాఫ్ సెంచరీ కొట్టిన సల్మాన్ | salman khan turns 50 today | Sakshi
Sakshi News home page

హాఫ్ సెంచరీ కొట్టిన సల్మాన్

Dec 27 2015 10:01 AM | Updated on Jul 18 2019 1:41 PM

హాఫ్ సెంచరీ కొట్టిన సల్మాన్ - Sakshi

హాఫ్ సెంచరీ కొట్టిన సల్మాన్

2015లో భారీ సక్సెస్లతో అలరించిన సల్మాన్ ఖాన్, ఈ ఏడాది మరో మెమరబుల్ మార్క్ను రీచ్ అయ్యాడు. ఈ ఆదివారం ( డిసెంబర్ 27) తన 50వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నాడు. ఇప్పటికీ బాలీవుడ్లో...

2015లో భారీ సక్సెస్లతో అలరించిన సల్మాన్ ఖాన్, ఈ ఏడాది మరో మెమరబుల్ మార్క్ను రీచ్ అయ్యాడు. ఈ ఆదివారం ( డిసెంబర్ 27) తన 50వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నాడు. ఇప్పటికీ బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా ఉన్న సల్లూ భాయ్, గోల్డెన్ జూబ్లీ బర్తే డే సెలబ్రేషన్స్ను భారీగా నిర్వహించడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ వెబ్ సైట్లలో సల్మాన్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్లు వెళ్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు బీటౌన్ సెలబ్రిటీలు కూడా సల్మాన్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇప్పటి వరకు సల్మాన్ పాల్గొనే పుట్టిన రోజుక వేడుకలపై ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం సుల్తాన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్, ఈ సారి తన పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి కొంత మంది సల్మాన్ పుట్టిన రోజును బిగ్బాస్ 9 సెట్లో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. సల్మాన్ టీం నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం లేదు.

ఈ సారి సల్మాన్ జరుపుకుంటున్న పుట్టినరోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చాలా రోజులుగా సల్మాన్ ను ఇబ్బంది పెడుతున్న కోర్ట్ కేసుల నుంచి కండలవీరుడికి విముక్తి లభించటంతో పాటు సల్మాన్ జీవితకథ బీయింగ్ హ్యూమన్ పేరుతో పుస్తక రూపంలో రిలీజ్ అవుతోంది. ఇలా వరుస సక్సెస్లతో పుట్టిన రోజును గ్రాండ్గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లూ భాయ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement