ప్రభుదేవా డైరెక్షన్‌లో సల్మాన్‌ ‘దబాంగ్‌-3’ | Salman Khan Starts Dabangg 3 Shoot With Prabhudheva | Sakshi
Sakshi News home page

దబాంగ్‌ 3 చిత్రం షూటింగ్‌ ప్రారంభం

Apr 1 2019 4:48 PM | Updated on Apr 1 2019 6:57 PM

Salman Khan Starts Dabangg 3 Shoot With Prabhudheva - Sakshi

ముంబై: సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దబాంగ్‌ 3’ చిత్రం షూటింగ్‌ ఆదివారం ఇండోర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ దర్శకుడు ప్రభుదేవాతో కలిసున్న ఫోటోను పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలో సల్లూని చూసి అభిమానులు ఈల వేయాల్సిందే. ఇక సినిమా విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ముహూర్త క్లాప్‌నిచ్చే ఫోటోను పోస్ట్‌ చేస్తూ చుల్‌బుల్‌ పాండే (సల్మాన్‌) ఈజ్‌ బ్యాక్‌ అంటూ ట్వీట్‌ చేశారు. తిరిగి జన్మస్థలానికి వచ్చేశాం అంటూ సల్మాన్‌ ఖాన్‌, అర్బజ్‌ ఖాన్‌ ఇండోర్‌లో ల్యాండ్‌ అయిన వీడియో క్లిప్‌ను సల్మాన్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సినిమా కోసం సల్లూభాయ్‌ బాగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగా వీరి తాతగారు పోలీసుగా పని చేసిన ఆయా ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఈ మధ్యే ‘దబాంగ్‌ 3’ కోసం సల్మాన్‌ ఏస్‌ కొరియాగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ని​ కలిశారు. 2010లో అభినవ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ‘దబాంగ్‌’ చిత్రం రాగా అది బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. యాక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ అయిన అర్బజ్‌ఖాన్‌ దానికి సీక్వెల్‌గా ‘దబాంగ్‌ 2’ తీశాడు. అది కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. మరి ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘దబాంగ్‌ 3’ చిత్రంతో రికార్డులు బద్దలు కొడతాడో లేదో వేచి చూడాలి.  ‘దబాంగ్‌ 3’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement