తాగలేదు.. బండి నడపలేదు! | Salman Khan says he was not driving | Sakshi
Sakshi News home page

తాగలేదు.. బండి నడపలేదు!

Mar 27 2015 7:37 PM | Updated on Sep 2 2017 11:28 PM

తాగలేదు.. బండి నడపలేదు!

తాగలేదు.. బండి నడపలేదు!

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ఖాన్ సరికొత్త సాక్ష్యం ఇచ్చాడు. అసలు ఆ సమయంలో కారును తాను నడపలేదని, అలాగే తాగి లేనని కోర్టులో చెప్పాడు.

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ఖాన్ సరికొత్త సాక్ష్యం ఇచ్చాడు. అసలు ఆ సమయంలో కారును తాను నడపలేదని, అలాగే తాగి లేనని కోర్టులో చెప్పాడు. కొన్నేళ్లుగా సాగుతూ వస్తున్న ఈ కేసులో సల్మాన్ ఖాన్ సాక్ష్యాన్ని శుక్రవారం నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై మోపిన అభియోగాలను సల్మాన్ ఖాన్ ఖండించాడు. 2002 సెప్టెంబర్ 28వ తేదీన కారు నడిపి ఒకరి మృతికి, నలుగురికి గాయాలు కావడానికి కారణమయ్యాడంటూ సల్మాన్ ఖాన్పై ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన డ్రైవర్ అల్తాఫ్ అనే వ్యక్తి కారు నడుపుతున్నట్లు సల్మాన్ చెప్పాడు.

అయితే సాక్ష్యం ఇచ్చినవారిలో ఒకరు మాత్రం.. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కారు నడుపుతుండగా తాను చూసినట్లు కోర్టులో చెప్పాడు. కానీ, సల్లూభాయ్ మాత్రం అదేమీ లేదంటున్నాడు. ఆ సమయంలో తన వైపున్న డోర్ జామ్ కావడంతో.. డ్రైవర్ సీటు వైపు నుంచి కిందకు దిగినట్లు చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement